మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 21:21:38

'లా లీగా'కు గ్రీన్‌సిగ్నల్‌.. జూన్‌ 8నుంచి!

'లా లీగా'కు గ్రీన్‌సిగ్నల్‌.. జూన్‌ 8నుంచి!

మాడ్రిడ్‌: స్పెయిన్‌ మేజర్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ లా లీగాకు అక్కడి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూన్‌ రెండో వారం  నుంచి టోర్నీ నిర్వహించుకోవచ్చని స్పెయిన్‌ ప్రధాన మంత్రి పెడ్రో సంచెజ్‌ శనివారం ప్రకటించారు. దీంతో జూన్‌ 8 నుంచి లీగ్‌ ప్రేక్షకుల్లేంకుండా పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా జూన్‌ 12వ తేదీ నుంచి లీగ్‌ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నామని లా లీగా అధ్యక్షుడు జేవియర్‌ టెబాస్‌ గతంలో చెప్పారు. అయితే ప్రధాని ప్రకటనతో తేదీ మారే అవకాశం ఉంది. 'లా లీగాతో పాటు ముఖ్యమైన క్రీడాపోటీలను జూన్‌ 8 నుంచి పునఃప్రారంభించుకునేందుకు అనుమతిస్తున్నాం' అని ప్రధాని ఫెడ్రో చెప్పారు. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా మార్చి 12న లా లీగా పోటీలు నిలిచిపోయాయి. ఈ సీజన్‌ ఫైనల్‌ రౌండ్‌ జూలైలో ముగియాల్సి ఉంది.  


logo