మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 01, 2020 , 15:06:55

CSK vs KXIP: గెలిస్తేనే ప్లేఆఫ్‌ రేసులో..

CSK vs KXIP: గెలిస్తేనే ప్లేఆఫ్‌ రేసులో..

అబుదాబి: ఐపీఎల్‌-13వ సీజన్‌  ప్లేఆఫ్  రేస్‌ నుంచి ఇప్పటికే  నిష్క్రమించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌    పోతూపోతూ  మిగతా జట్ల   ఆశలకు గండికొడుతోంది.  ప్లేఆఫ్‌ రేసులో ఉన్న కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు చెన్నైతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో చెన్నైపై గెలిస్తేనే పంజాబ్‌ ప్లేఆఫ్‌ రేసులో ఉంటుంది. సీజన్‌లో తమ ఆఖరి మ్యాచ్‌ను ఘనంగా ముగించాలని ధోనీసేన భావిస్తోంది.   

టాస్‌ గెలిచిన చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. షేన్‌ వాట్సన్‌, సాంట్నర్‌, కర్ణ్‌ శర్మ స్థానంలో డుప్లెసిస్‌, తాహిర్‌, శార్దుల్‌ ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకున్నట్లు ధోనీ చెప్పాడు. వరుసగా విఫలమవుతున్న మాక్స్‌వెల్‌ స్థానంలో జేమ్స్‌ నీషమ్‌, అర్షదీప్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి  తీసుకున్నట్లు పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ వివరించాడు.