శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Jan 24, 2021 , 18:01:24

రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా సంగక్కర

రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా సంగక్కర

ముంబై: ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలన్నీ   రాబోయే సీజన్‌ కోసం  సన్నద్ధమవుతున్నాయి. కొన్ని ఫ్రాంఛైజీలు జట్టులో భారీ మార్పులు కూడా చేశాయి. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కారణంగా స్టీవ్‌ స్మిత్‌ను విడిచిపెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌  యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.   స్మిత్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ 2020 సీజన్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

రాబోయే సీజన్‌ కోసం శ్రీలంక మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంగక్కరను  క్రికెట్‌ డైరెక్టర్‌గా నియమించినట్లు రాజస్థాన్‌ ఫ్రాంఛైజీ ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) అధ్యక్షుడిగా ఉన్న సంగక్కర  ఫ్రాంఛైజీ అన్ని విభాగాల్లో భారీ మార్పులు చేయనున్నాడు.  జట్టు కోచింగ్‌ స్ట్రక్చర్‌, వేలం ప్రణాళికలు, జట్టు వ్యూహం, టాలెంట్‌ కలిగిన ఆటగాళ్లను గుర్తించడం, వారిని నైపుణ్యాన్ని పెంచడం,  ఫ్రాంఛైజీ క్రికెట్‌ వ్యవహారాలతో పాటు నాగపూర్‌లోని రాయల్స్‌ అకాడమీ అభివృద్ధి తదితర అంశాలను సంగక్కర పర్యవేక్షించనున్నాడు.   

VIDEOS

logo