శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sports - Jul 04, 2020 , 02:14:16

స్మిత్‌, ఏబీకి బౌలింగ్‌ కష్టం: కుల్దీప్‌

 స్మిత్‌, ఏబీకి   బౌలింగ్‌ కష్టం: కుల్దీప్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు బౌలింగ్‌ చేయడం సవాల్‌తో కూడుకున్నదని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అన్నాడు. శుక్రవారం ఓ టీవీ షోలో కుల్దీప్‌ మాట్లాడుతూ.. ‘స్మిత్‌ ఎక్కువగా బ్యాక్‌ఫుట్‌పై ఆడుతాడు. అలాంటప్పుడు అతడికి బౌలింగ్‌ చేయడం కష్టమవుతుంది. వన్డేల్లో డివిలియర్స్‌ చాలా ప్రమాదకారి. అతడు ఆటకు వీడ్కోలు పలకడం నాకు సంతోషమైన విషయం. వీరిద్దరు మినహా ప్రపంచంలో ఇతర బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేసే ముందెప్పుడూ నేను జంకలేదు’ అని అన్నాడు.  వికెట్ల వెనుక ధోనీ ఉంటే స్పిన్నర్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కుల్దీప్‌ చెప్పుకొచ్చాడు.