సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 18, 2021 , 20:27:37

శెభాష్‌...సిరాజ్‌: మంత్రి కేటీఆర్‌

శెభాష్‌...సిరాజ్‌: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో ఆఖరిదైన నాలుగో టెస్టులో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్‌ టెస్టులో  సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌  ప్రదర్శనను మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో   సిరాజ్ 5 వికెట్లు తీసుకోవ‌డం ద్వారా అరుదైన  క్లబ్‌లో చేరాడు.  ఆడిన తొలి టెస్ట్ సిరీస్‌లోనే ఐదు వికెట్ల ఘ‌న‌త సాధించ‌డం ఒక విశేష‌మైతే.. గ‌బ్బా స్టేడియంలో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఐదో ఇండియ‌న్ బౌల‌ర్‌గా సిరాజ్ నిలిచాడు. 

'హైదరాబాద్‌ కుర్రాడు సిరాజ్‌ చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. తన తండ్రి ఆశయం నెరవేర్చేందుకు పుట్టెడు దుఃఖంలోనూ  బాధను దిగమింగుకొని రాణించడం గొప్ప విషయం.  నీ ప్రదర్శనతో భారత్‌ సిరీస్‌ గెలవగలదనే  నమ్మకం వచ్చింది.   పైనున్న మీ తండ్రి నీ  ప్రతిభను చూసి గర్వపడతారని,  ఆశీర్వదిస్తారని' కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

VIDEOS

logo