గురువారం 09 జూలై 2020
Sports - Apr 23, 2020 , 20:00:27

విభిన్నంగా టేబుల్ టెన్నిస్ ఆడిన పాండ్య బ్రదర్స్

విభిన్నంగా టేబుల్ టెన్నిస్ ఆడిన పాండ్య బ్రదర్స్

ముంబై: కరోనా వైరస్ కారణంగా క్రికెట్ పోటీలు నిలిచిపోవడంతో ప్లేయర్లు ఇండ్లలోనే ఉంటూ కుటుంబంతో సమయాన్ని సంతోషంగా గడుపుతున్నారు. అప్పుడప్పుడూ వినూత్న రీతిలో ఆటలు కూడా ఆడుకుంటున్నారు. మైదానంలో ఎప్పుడూ జోష్​ మీద ఉండే టీమ్​ఇండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య ఇంట్లో కొత్త పద్ధతిలో టేబుల్ టెన్నిస్ ఆడారు. ఈ వీడియోను ట్విట్టర్​లో కృనాల్ గురువారం పోస్ట్ చేశాడు. ముంబై ఇండియన్స్​ ఆటగాళ్లైన పాండ్య బ్రదర్స్​ ఇద్దరూ బెడ్​కు చెరో వైపు నిలబడి టెన్నిస్ బాల్​తో చేతుల సాయంతో టేబుల్​ టెన్నిస్ ఆడారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కృనాల్​ “పాండ్య బ్రదర్స్​ విభిన్నమైన ఆటలో ఉన్నారు. ఇద్దరం ఎప్పుడూ పోటీ పడుతుంటాం. మరి ఈ రౌండ్ ఎవరు గెలిచారనుకుంటున్నారు?’ అని అభిమానులను ప్రశ్నించాడు. 


logo