శుక్రవారం 05 మార్చి 2021
Sports - Jan 16, 2021 , 10:20:04

హార్ధిక్ పాండ్యా తండ్రి క‌న్నుమూత‌..

హార్ధిక్ పాండ్యా తండ్రి క‌న్నుమూత‌..

రాజ్‌కోట్‌:  టీమిండియా క్రికెట‌ర్ హార్ధిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఇవాళ ఉద‌యం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు చెప్పారు.  హార్ధిక్ పాండ్యా సోద‌రుడు కృణాల్ పాండ్యా ప్ర‌స్తుతం స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలో బ‌రోడా కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. అయితే తండ్రి మ‌ర‌ణ‌వార్త తెలిసిన కృణాల్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించాడు. ఈ విష‌యాన్ని జ‌ట్టు యాజ‌మాన్యం పేర్కొన్న‌ది. కృణాల్ నేతృత్వంలోని బ‌రోడా జ‌ట్టు.. ఇప్ప‌టివ‌ర‌కు ముస్తాక్ అలీ టోర్నీలో మూడు మ్యాచ్‌ల‌ను గెలిచింది.  ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో జ‌రిగే సిరీస్ కోసం ప్రాక్టీసు చేస్తున్నాడు.  ముస్తాక్ అలీ టోర్నీలో హార్ధిక్ ఆడ‌డం లేదు. 

VIDEOS

logo