సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 09:26:46

కోజికోడ్‌ విమాన ప్రమాదం.. సంతాపం తెలిపిన విరాట్‌ కోహ్లి

కోజికోడ్‌ విమాన ప్రమాదం.. సంతాపం తెలిపిన విరాట్‌ కోహ్లి

కేరళలోని కోజికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సహా 20 మంది వరకు దుర్మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం ప్రకటిస్తుండగా తాజాగా టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంతాపం వ్యక్తం చేశారు. 

‘‘కోజికోడ్‌లో విమాన ప్రమాదానికి గురైన వారి కోసం ప్రార్థిస్తున్నా. ప్రాణాలు కోల్పోయిన వారి ప్రియమైన వారందరికీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’’ అని విరాట్‌ కోహ్లి శుక్రవారం రాత్రి ట్వీట్‌ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo