గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 17, 2020 , 12:54:59

కెయిన్స్ క‌ప్ విజేత కోనేరు హంపి

కెయిన్స్ క‌ప్ విజేత కోనేరు హంపి

హైద‌రాబాద్‌:  ప్ర‌పంచ రాపిడ్ చాంపియ‌న్‌, భార‌తీయ గ్రాండ్‌మాస్ట‌ర్ కోనేరు హంపి.. అమెరికాలో జ‌రిగిన కెయిన్స్ క‌ప్ చెస్ టోర్న‌మెంట్‌ను గెలుచుకున్న‌ది.  9 రౌండ్ల టోర్నీలో.. హంపి ఆరు పాయింట్లు సాధించి టైటిల్‌ను కైవ‌సం చేసుకున్న‌ది.  మ‌రో రౌండ్ మిగిలి ఉండగానే.. ఆమె విక్ట‌రీ ఖాయ‌మైంది.  కెయిన్స్ క‌ప్‌ను నిర్వ‌హించ‌డం ఇది రెండ‌వ‌సారి.  ఇంట‌ర్నేష‌న్ చెస్ స‌మాఖ్య ఆధ్వ‌ర్యంలో ఈ టోర్నీ జ‌రిగింది. ప్ర‌స్తుత వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ జూ వెంజున్‌.. అయిదున్న‌ర పాయింట్ల‌తో రెండ‌వ స్థానంలో నిలిచింది.  ర‌ష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోస్టానిక్ మూడ‌వ స్థానంలో నిలిచింది. గ‌త ఏడాది మ‌హిళ‌ల రాపిడ్ చెస్ చాంపియ‌న్‌షిప్‌ను గ్రాండ్‌మాస్ట‌ర్ కోనేరు హంపి గెలుచుకున్న‌ది. ఆ టోర్నీలో చైనాకు చెందిన లీ యంగ్జీపై ఆమె విజ‌యం సాధించింది. కెయిన్స్ క‌ప్ విజేత హంపికి.. టోర్నీ నిర్వాహ‌కులు 45వేల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ ఇవ్వ‌నున్నారు.  ట్రోఫీని కూడా ఆమెకు బ‌హూక‌రిస్తారు.  


logo
>>>>>>