మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Nov 01, 2020 , 18:37:12

ఓడితే ఇంటికి..గెలిస్తే ముందుకు

ఓడితే ఇంటికి..గెలిస్తే ముందుకు

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో ఆదివారం రాత్రి రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.  కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు హోరాహోరు పోరుకు రెడీ అయ్యాయి.  కోల్‌కతా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా..రాజస్థాన్‌  వరుసగా  రెండింటిలో గెలిచి ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కోల్‌కతా కన్నా రాజస్థాన్‌ నెట్‌రన్‌రేట్‌ కాస్త మెరుగ్గా ఉంది. 

ఇరు జట్లు ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడగా 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి.  గెలిచే జట్టు నెట్‌రన్‌రేట్‌ ఆధారంగా  ప్లేఆఫ్‌ బెర్తు ఖాయంకానుంది. రెండు జట్లకు చావోరేవో కావడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగనుంది.