బుధవారం 25 నవంబర్ 2020
Sports - Sep 30, 2020 , 20:10:45

RR vs KKR: నరైన్‌ బౌల్డ్‌.. రాజస్థాన్‌ బౌలర్లు అదుర్స్‌

RR vs KKR: నరైన్‌ బౌల్డ్‌.. రాజస్థాన్‌ బౌలర్లు అదుర్స్‌

దుబాయ్: రాజస్థాన్‌ రాయల్స్‌తో  మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఉనద్కత్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(15: 14 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది తర్వాతి బంతికే బౌల్డ్‌ అయ్యాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నరైన్‌ ఓపెనర్‌గా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా అతనితో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడించాలనుకున్న  కోల్‌కతాకు ఈ సీజన్‌లో  మరోసారి నిరాశే ఎదురైంది.

పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా వికెట్‌ నష్టానికి 42  పరుగులు చేసింది. మొదటి ఆరు ఓవర్లలో తమ బౌలర్లను రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. పవర్‌ప్లేలో ఏకంగా ఐదుగురు బౌలర్లను రంగంలోకి దించాడు.  అందరూ గొప్పగా బంతులేసి  కోల్‌కతాను నియంత్రించారు.  కోల్‌కతా  భారీగా పరుగులు చేయకుండా బౌలర్లు బ్రేక్‌ వేశారు.  7 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్‌ నష్టానికి 52 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(26), నితీశ్‌ రాణా(7) క్రీజులో ఉన్నారు.