ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 16, 2020 , 19:09:05

MI vs KKR: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మోర్గాన్‌

MI vs KKR: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మోర్గాన్‌

అబుదాబి: ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడుతున్నాయి.   కొత్త కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలో కోల్‌కతా బరిలో దిగుతోంది.  టాస్‌ గెలిచిన మోర్గాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టామ్‌ బాంటన్‌, నాగర్‌కోటి స్థానంలో శివమ్‌ మావి, క్రిస్‌ గ్రీన్‌లను తుది జట్టులోకి తీసుకున్నట్లు మోర్గాన్‌ చెప్పాడు. 

సీజన్‌ ఆరంభం నుంచి ముంబై పేస్‌ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్న జేమ్స్‌ పాటిన్సన్‌కు విశ్రాంతినిచ్చినట్లు ముంబై సారథి రోహిత్‌ శర్మ తెలిపాడు. అతని స్థానంలో నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ను తీసుకున్నట్లు వెల్లడించాడు.