బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Feb 01, 2021 , 17:10:01

కోల్‌కతా స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా లీమన్‌

కోల్‌కతా స్ట్రాటజిక్‌  కన్సల్టెంట్‌గా లీమన్‌

న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్‌) ఫ్రాంఛైజీ రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)-2021 సీజన్‌ కోసం సన్నద్ధమవుతోంది. కోల్‌కతా స్ట్రాటజిక్‌  కన్సల్టెంట్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన పరిమిత ఓవర్ల క్రికెట్‌  విశ్లేషకుడు నాథన్‌ లీమన్‌ను వ్యూహాత్మక సలహాదారుగా నియమించుకుంది.  చెన్నై వేదికగా  ఫిబ్రవరి 18న జరిగే ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో కేకేఆర్‌కు అతడు సహకరించనున్నాడు.  ప్రస్తుతం కేకేఆర్‌ పెర్‌ఫామెన్స్‌ అనలిస్ట్‌ ఏఆర్‌ శ్రీకాంత్‌తో కలిసి లీమన్‌ పనిచేయనున్నాడు. 

కోల్‌కతాతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో   ఐపీఎల్‌ 2021 జరిగే సమయంలో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) నుంచి నాథన్‌ సెలవు తీసుకుంటాడు.  వేలంలో కేకేఆర్‌ ఇంకా ఎనిమిది మందిని తీసుకునేందుకు అవకాశం ఉంది.  2021 జట్టు నుంచి టామ్‌ బాంటన్‌, క్రిస్‌ గ్రీన్‌లను ఆ ఫ్రాంఛైజీ వదులుకోవడంతో ఆ రెండు స్థానాలను భర్తీ చేయొచ్చు. 

VIDEOS

logo