శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Sep 23, 2020 , 19:07:25

ముంబైపై ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

ముంబైపై ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

అబుదాబి: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బుధవారం మరో రసవత్తర పోరు ఆరంభమైంది.  ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు అబుదాబి వేదికగా తలపడుతున్నాయి. రెండు జట్లూ బలమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌తో పటిష్టంగా ఉండటంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగనుంది. 

టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు ముంబై కెప్టెన్‌ రోహిత్‌ తెలిపాడు. టోర్నీలో కోల్‌కతా తొలి మ్యాచ్‌ ఆడుతుండగా..ఆరంభ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ముంబై కంగుతున్నది. టోర్నీలో శుభారంభం చేయాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.