దుబాయ్: ఫుట్‌బాల్, హాకీలాంటి గేమ్స్‌లో ఫీల్డ్‌లో కెప్టెన్ కంటే ఎక్కువగా బయట ఉన్న కోచ్‌దే కీరోల్. బయటి నుంచి ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ అవి ఫీల్డ్‌లోని కెప్టెన్‌కు చేరవేస్తుంటాడు. అయితే క్రికెట్లో పరిస్థితి వేరు. కోచ్ కంటే ఫీల్డ్‌లోని కెప్టెనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఐపీఎల్( IPL 2021 )లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న ఇయాన్ మోర్గాన్ మాత్రం ఎప్పటికప్పుడు డగౌట్ నుంచి కోడ్ భాషలో సూచనలు అందుకోవడం తాజాగా కనిపించింది.
ముంబైతో మ్యాచ్‌లో ఆ టీమ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతుండగా.. వెనుక ఉన్న టీమ్ అనలిస్ట్ నేథన్ లీమన్.. ఏవో నంబర్లను మోర్గాన్‌కు కనిపించేలా పెట్టాడు. మొదట నాలుగు నంబర్‌ను, కాసేపటికి మూడు నంబర్‌ను చూపించడం కనిపించింది. వీటి ద్వారా ఎప్పటికప్పుడు ఫీల్డ్‌లోని కెప్టెన్‌ను అప్రమత్తం చేస్తున్నాడు అనలిస్ట్ నేథన్ లీమన్.
నిజానికి ఇతడు ఇంగ్లండ్ టీమ్‌కు కూడా అనలిస్టే. ఈ మధ్య సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లోనూ లీమన్.. ఇలా కోడ్ నంబర్లతో మోర్గాన్‌ను అలెర్ట్ చేయడం కనిపించింది. దానికి సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.