ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతున్న సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక విజయాన్నందుకుంది. మొదట బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన కోల్‌కతా.. ఆ తర్వాత సులువైన లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. తన పూర్తి కోటాలో 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్.. కీలక దశలో బ్యాటింగ్‌కు వచ్చి 10 బంతుల్లోనే 21 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
షార్జా: బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పైచేయి సాధించింది. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. ఓపెనర్ స్మిత్ (39), కెప్టెన్ రిషబ్ పంత్ (39) రాణించారు. వీరిద్దరితో పాటు శిఖర్ ధవన్ (24) తప్ప ఢిల్లీ జట్టులో ఏ ఒక్క బ్యాటర్ రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయాడు. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. నితీశ్ రాణా (36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (30) ఫర్వాలేదనిపించగా.. సునీల్ నరైన్ (10 బంతుల్లో 21; ఒక ఫోర్, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
2 ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఒక్క సిక్సర్ కొట్టకపోవడం ఇది రెండోసారి మాత్రమే.
స్కోరు బోర్డు
ఢిల్లీ: స్మిత్ (బి) ఫెర్గూసన్ 39, ధవన్ (సి) వెంకటేశ్ (బి) ఫెర్గూసన్ 24, శ్రేయస్ (బి) నరైన్ 1, పంత్ (రనౌట్) 39, హెట్‌మైర్ (సి) సౌథీ (బి) వెంకటేశ్ 4, లలిత్ (ఎల్బీ) నరైన్ 0, అక్షర్ (సి) ఫెర్గూసన్ (బి) వెంకటేశ్ 0, అ, – (సి) రాణా (బి) సౌథీ 9, రబడ (నాటౌట్) 0, అవేశ్ (రనౌట్/కార్తీక్( 5, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 127/9. వికెట్ల పతనం: -1-35, 2-40, 3-77, 4-88, 5-89, 6-92, 7-120, 8-122, 9-127, బౌలింగ్: సందీప్ 2-0-15-0, సౌథీ 4-0-29-1, ఫెర్గూసన్ 2-0-10-2, వరుణ్ 4-0-24-0, నరైన్ 4-0-18-2, వెంకటేశ్ 4-0-29-2.
కోల్‌కతా: గిల్ (సి) శ్రేయస్ (బి) రబడ 30, వెంకటేశ్ (బి) లలిత్ 14, త్రిపాఠి (సి) సుమిత్ (బి) అవేశ్ 9, రాణా (నాటౌట్) 36, మోర్గాన్ (సి) లలిత్ (బి) అశ్విన్ 0, కార్తీక్ (బి) అవేశ్ 12, నరైన్ (సి) అక్షర్ (బి) నోర్జే 21, సౌథీ (బి) అవేశ్ 3, ఫెర్గూసన్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 18.2 ఓవర్లలో 130/7. వికెట్ల పతనం: 1-28, 2-43, 3-67, 4-67, 5-96, 6-122, 7-126, బౌలింగ్: నోర్జే 2.2-0-15-1, అక్షర్ 3-0-13-0, అశ్విన్ 4-0-24-1, లలిత్ 3-0-35-1, అవేశ్ 3-0-13-3, రబడ 3-1-28-1.