శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 15:29:08

కోహ్లీ.. ఇది టెస్ట్ మ్యాచ్ కాదు.. టీ20 : పీటర్స‌న్‌

కోహ్లీ.. ఇది టెస్ట్ మ్యాచ్ కాదు.. టీ20 : పీటర్స‌న్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దాదాపు ఐదు నెల‌ల పాటు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. తాజాగా ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకున్నాడు. అక్క‌డ గ‌త వారం రోజుల నుంచి ప్రాక్టీస్ ప్రారంభించిన విరాట్‌.. నెట్స్‌లో ఆర్‌సీబీ ఆట‌గాళ్ల‌తో క‌లిసి చెమ‌టోడుస్తున్నాడు. తాను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోల‌ను విరాట్ ఇటీవ‌ల ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేయ‌గా.. ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ ‘‘కోహ్లీ బంతిని హిట్ చేయ్. ఇది టీ20.. టెస్టు మ్యాచ్ కాదు’’అని స‌ర‌దా కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన కోహ్లి  ‘‘హ హ .. థాంక్స్ మేట్‌. ఈ సూచ‌న మీలాంటి సాంకేతిక ప్రతిభావంతులైన ఆటగాడి నుంచి వ‌స్తున్న‌ది. ఇది పరిశీలించ‌ద‌గిన‌ద‌ని నాకు తెలుసు’’అని రిప్లై ఇచ్చాడు. 

వాస్త‌వానికి కెప్టెన్ కోహ్లి ప్ర‌తి బంతిని హిట్టింగ్ ఆడ‌డు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా త‌న ఆటను మారుస్తుంటాడు. అందుకే ఇప్పుడు ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo