ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 08, 2020 , 11:33:32

కోహ్లీని కెప్టెన్సీ నుంచి తీసేయాలి : గౌతీ

కోహ్లీని కెప్టెన్సీ నుంచి తీసేయాలి :  గౌతీ

న్యూఢిల్లీ : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాల్సిన సమయం వచ్చిందని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, రెండుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ చాంపియన్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. అతడి కెప్టెన్సీలో ఎనిమిదేండ్లుగా ఆర్‌సీబీ ఒక్క టైటిల్‌ కూడా సాధించలేదని, ఈ నేపథ్యంలో జవాబుదారీతనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఓ ఇంటర్వ్యూలో గౌతీ చెప్పాడు. ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌ చేతిలో బెంగళూరు ఓడిపోవడంపై గంభీర్‌ మాట్లాడాడు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలా అని ఎదురైన ప్రశ్నకు సమాధానమిచ్చాడు.


‘వందకు వంద శాతం. ఎందుకంటే జవాబుదారితనంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టైటిల్‌ లేకుండా ఇప్పటికే ఎనిమిదేండ్లు అయింది. ఇది చాలా సుదీర్ఘ సమయం. కెప్టెన్‌గానే కాదు.. ఏ ప్లేయర్‌ అయినా టైటిల్‌ సాధించకుండా ఎనిమిదేండ్లు ఒకే జట్టులో కొనసాగారా..? అశ్విన్‌ విషయాన్నే తీసుకుంటే.. పంజాబ్‌ తరఫున రెండేండ్లు టైటిల్‌ సాధించలేకపోయాడు. దీంతో కెప్టెన్సీ పోయింది. రోహిత్‌, ధోనీ టైటిళ్లు సాధించారు కాబట్టే ఇంకా సారథులుగా ఉన్నారు. ఒకవేళ డివిలియర్స్‌ కూడా రాణించకపోతే ఈ ఏడాది ఆర్‌సీబీ పరిస్థితి ఏమై ఉండేది. అతడి వల్లే బెంగళూరు ప్లేఆఫ్స్‌ చేరగలిగింది’ అని గంభీర్‌ అన్నాడు.  లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.