బుధవారం 08 జూలై 2020
Sports - Apr 16, 2020 , 12:10:36

వాళ్లిద్ద‌రూ స‌హ‌జ‌సిద్ధ సార‌థులు: కోరె అండ‌ర్స‌న్‌

వాళ్లిద్ద‌రూ స‌హ‌జ‌సిద్ధ సార‌థులు:  కోరె అండ‌ర్స‌న్‌

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా సార‌థ్య ద్వయం విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ స‌హ‌జ‌సిద్ధ నాయ‌కుల‌ని న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ కోరె అండ‌ర్స‌న్ పేర్కొన్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ సంద‌ర్భంగా.. ఇద్ద‌రి నాయ‌క‌త్వంలో ఆడిన అనుభ‌వం ఉన్న అండ‌ర్స‌న్‌.. మ్యాచ్‌లో ఇద్ద‌రి ఆలోచ‌నా తీరు ఒకే విధంగా సాగుతుంద‌ని అన్నాడు. గ్రౌండ్‌లో ఉన్నంత‌సేపు విజ‌యం సాధించాల‌నే క‌సి వారిలో క‌నిపిస్తుంద‌ని అన్నాడు. 

`ఐపీఎల్లో పాలుపంచుకోవ‌డం ద్వారా అనేక మంది అంత‌ర్జాతీయ స్టార్ల‌తో క‌లిసి ఆడే అవ‌కాశం ద‌క్కింది. ముంబైకి నా మ‌న‌సులో ప్ర‌త్య‌క స్థానం ఉంటుంది. బెంగ‌ళూరు, ఢిల్లీ త‌ర‌ఫున కూడా చాలా జ్ఞాప‌కాలు ఉన్నాయి. 2008 అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో విరాట్ కోహ్లీకి ప్ర‌త్య‌ర్థిగా ఆడి స‌రిగ్గా ప‌దేండ్ల త‌ర్వాత 2018లో అత‌డితో క‌లిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవ‌డం కొత్త‌గా అనిపించింది. కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో పెద్ద తేడా క‌నిపించ‌దు. ఇద్ద‌రి ఆలోచ‌న విధానం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఇద్ద‌రు గొప్ప నాయ‌కులే. అయితే ఐపీఎల్లో కోహ్లీతో పోలిస్తే.. రోహిత్ కాస్త ముందుంటాడు` అని అండ‌ర్స‌న్ పేర్కొన్నాడు. 


logo