బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 18:13:08

తొలి రెండు ర్యాంకుల్లోనే కోహ్లీ, రోహిత్

తొలి రెండు ర్యాంకుల్లోనే కోహ్లీ, రోహిత్

దుబాయ్​: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​ బ్యాట్స్​మెన్ విభాగంలో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ర్యాంకులో కొనసాగుతున్నారు. తాజా వన్డే ర్యాంకింగ్స్​ను ఐసీసీ బుధవారం వెల్లడించింది. వన్డే బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ(871పాయింట్లు), రోహిత్​(855), పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్​(829)టాప్​-3లో ఉన్నారు. కాగా తాజాగా ఇంగ్లండ్​తో జరిగిన చివరి వన్డేలో శతకంతో అదరగొట్టిన ఐర్లాండ్ కెప్టెన్ అండ్రూ బాల్​బ్రెయిన్ 42వ ర్యాంకుకు చేరాడు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్​లో భారత స్పీడ్​స్టర్ జస్ర్పీత్ బుమ్రా(719పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్​(722) టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ ముజీబుల్ రహ్మాన్​(701) మూడో ర్యాంకులో ఉన్నాడు. ఐర్లాండ్​తో సిరీస్​లో రాణించిన ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్​ నాలుగు స్థానాలను మెరుగుపరుచుకొని 25వ ర్యాంకుకు చేరాడు. కాగా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ సూపర్​ లీగ్​లో భాగంగా ఐర్లాండ్​తో జరిగిన తొలి సిరీస్​ను 2-1తో గెలిచిన ఇంగ్లండ్ 20పాయింట్లతో ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే.  


logo