శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 19:49:44

పాపులర్ క్రికెట‌ర్ కోహ్లీ

పాపులర్ క్రికెట‌ర్ కోహ్లీ

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్ర‌పంచంలో అత్యంత పాపుల‌ర్ క్రికెట‌ర్ అని ఓ అధ్య‌యనం తేల్చింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి-జూన్ మ‌ధ్య ఆన్‌లైన్‌లో కోహ్లీ కోసం నెల‌కు స‌గ‌టున దాదాపు 16.2 ల‌క్ష‌ల సార్లు వెతికిన‌ట్లు ఎస్ఈఎస్ ర‌ష్ అనే సంస్థ సోమ‌వారం వెల్ల‌డించింది. భార‌త క్రికెట్ జ‌ట్టు గురించి నెల‌కు 2.4 ల‌క్ష‌ల మంది వెతికిన‌ట్లు ఈ అధ్య‌యనంలో తేలింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ 0.66 ల‌క్ష‌ల‌తో రెండోస్థానంలో ఉంది. క్రికెట‌ర్ల జాబితాలో భార‌త్‌కు చెందిన వాళ్లే ఆరుగురు ఉండ‌టం విశేషం. 


1. విరాట్ కోహ్లీ 16.2 ల‌క్ష‌లు

2. రోహిత్ శ‌ర్మ 9.7 ల‌క్ష‌లు

3. మ‌హేంద్ర‌సింగ్ ధోనీ 9.4 ల‌క్ష‌లు

4. జార్జ్ మెకే 9.1 ల‌క్ష‌లు

5. జోష్ రిచ‌ర్డ్స్ 7.1 ల‌క్ష‌లు

6. హార్దిక్ పాండ్యా 6.7 ల‌క్ష‌లు

7. స‌చిన్ టెండూల్క‌ర్ 5.4 ల‌క్ష‌లు

8. క్రిస్ మాథ్యూస్ 4.1 ల‌క్ష‌లు

9. శ్రేయ‌స్ అయ్య‌ర్ 3.4 ల‌క్ష‌లుlogo