శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 08, 2020 , 12:35:28

కోహ్లి, రాహుల్‌ ఔట్‌.. ఒత్తిడిలో భారత్‌

కోహ్లి, రాహుల్‌ ఔట్‌.. ఒత్తిడిలో భారత్‌

ఆక్లాండ్‌: ఈడెన్‌పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో 274 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తడబడుతున్నారు. 34 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన భారత్‌.. కష్టాల్లో పడింది. అనంతరం, కెప్టెన్‌ కోహ్లి(15), శ్రేయాస్‌ అయ్యర్‌(22 బ్యాటింగ్‌) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా.. భారత్‌కు ఊహించని షాక్‌ ఇచ్చాడు కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ. అద్భుతమైన డెలివరీతో కోహ్లిని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో, భారత్‌ తీవ్ర ఒత్తిడిలో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన లోకేష్‌ రాహుల్‌ 8 బంతులెదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి గ్రాండ్‌హోమ్‌ బౌలింగ్‌లో బంతిని వికెట్ల పైకి ఆడుకున్నాడు. దీంతో భారత్‌ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం శ్రేయాస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌ క్రీజులో ఉన్నారు. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. భారత్‌ విజయం సాధించాలంటే 35 ఓవర్లలో 199 పరుగులు చేయాలి. 


logo