ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 11, 2020 , 17:59:19

బ్యాట్‌ను సిద్ధం చేసుకుంటున్న కోహ్లి.. వీడియో

బ్యాట్‌ను సిద్ధం చేసుకుంటున్న కోహ్లి.. వీడియో

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట విష‌యంలో ఎంతో నిబద్ధ‌త‌తో ఉంటాడు.  మ‌రో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం కెప్టెన్ కోహ్లి నెట్స్‌లో క‌ఠోర సాధ‌న చేస్తున్నాడు. ఐపీఎల్ 2020 ఈనెల 19న నుంచి ప్రారంభం కానుండ‌గా సెప్టెంబ‌ర్ 21న ఆర్‌సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో తలపడనుంది.

ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం విరాట్ కోహ్లి అన అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. ఇక్కడ ఆర్‌సీబీ కెప్టెన్ త‌న బ్యాట్ హ్యాండిల్‌ను రంపంతో కోస్తూ మ‌ర‌మ్మ‌తులు చేస్తున్నాడు. "బ్యాట్ సమతుల్యతకు నాకు రెండు సెంటీమీటర్లు కూడా చాలా ముఖ్యమైన‌ది. నా బ్యాట్‌ల‌ను జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా ఇష్టం" అని కోహ్లీ ట్విట్టర్‌లో తన పోస్ట్‌కు క్యాప్షన్ చేశారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo