సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 29, 2020 , 13:04:53

ర‌హానే కెప్టెన్సీపై కోహ్లీ ప్ర‌శంస‌లు

ర‌హానే కెప్టెన్సీపై కోహ్లీ ప్ర‌శంస‌లు

హైద‌రాబాద్‌:  మెల్‌బోర్న్‌లో జ‌రిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఘ‌న విజ‌యం న‌మోదు చేసింది.  అజింక్య ర‌హానే సార‌థ్యంలో భార‌త జ‌ట్టు 8 వికెట్ల తేడాతో విక్ట‌రీని సొంతం చేసుకున్న‌ది.  ఈ గెలుపుపై విరాట్ కోహ్లీ స్పందించాడు.  త‌న ట్విట్ట‌ర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై గెల‌వ‌డం అద్భుత‌మ‌న్నాడు.  టీమిండియా శ్ర‌మించిన తీరు అనిర్వ‌చ‌నీయ‌మ‌ని కోహ్లీ ట్వీట్ చేశాడు. జ‌ట్టు విజ‌యం సాధించ‌డం.. ఇంత క‌న్నా సంతోషం ఏదీ లేద‌ని,  ర‌హానే త‌న కెప్టెన్సీతో జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపించిన తీరు అసాధార‌ణ‌మ‌ని కోహ్లీ త‌న ట్వీట్‌లో తెలిపాడు.  ఇక నుంచి భార‌త్ జైత్ర‌యాత్ర కొన‌సాగాల‌ని బైసెప్స్‌తో పాటు ఇండియా జెండా ఎమోజీల‌ను కోహ్లీ ట్వీట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచ‌రీతో పాటు రెండ‌వ ఇన్నింగ్స్‌లోనూ నాటౌట్‌గా నిలిచిన ర‌హానేకు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది.   


logo