శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 20:00:44

`ఆ ఇద్ద‌రే బెస్ట్ కెప్టెన్లు`

`ఆ ఇద్ద‌రే బెస్ట్ కెప్టెన్లు`

జైపూర్: ప‌్ర‌స్తుత టెస్టు క్రికెట్‌లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ ఉత్త‌మ సార‌థుల‌ను దేశ‌వాళీ క్రికెట‌ర్ ఫైజ్ ఫ‌జ‌ల్ అన్నాడు. రంజీ ట్రోఫీలో ట‌న్నుల కొద్ది ప‌రుగులు చేసిన ఫ‌జ‌ల్ విద‌ర్భ జ‌ట్ట‌కు కెప్టెన్‌గా టైటిల్ అందించిన విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం ఫ‌జ‌ల్ స్పోర్ట్స్ టైగ‌ర్ షోలో మాట్లాడుతూ..`నేను టిమ్ పైన్ అభిమానిని. టెస్టుల్లో అత‌డు జ‌ట్టును న‌డిపించే తీరు బాగుంటుంది. విరాట్ కోహ్లీ కూడా మంచి సార‌థి. టీమ్ఇండియాలో పోటీ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్లే నాకు అవ‌కాశాలు ద‌క్క‌లేదు. భార‌త టెస్టు జ‌ట్టులో నిల‌క‌డ‌గా ఆడాల‌నేది నా ల‌క్ష్యం`అని అన్నాడు. 

విద‌ర్భ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించ‌డాన్ని ఆస్వాదిస్తాన‌ని.. అది త‌న‌కు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తాన‌ని ఫ‌జ‌ల్ చెప్పాడు. ఏ స్థాయిలోనైనా క్రికెట్ ఆడడాన్ని ఇష్ట‌ప‌డతానని వివ‌రించాడు.


logo