శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 26, 2020 , 21:47:00

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ఎంపిక : గాయంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ దూరం

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ఎంపిక : గాయంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ దూరం

దుబాయ్‌ : ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ టైటిల్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టుకు విరాట్‌ కోహ్లీ నాయకత్వం వహించనున్నారు. 2018 లో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టిమ్ పైన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టును 2-1 తేడాతో ఓడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్‌ నిలుపుకున్నది. అండర్ డౌన్ టెస్ట్ సిరీస్‌లో ఆసియా జట్టు ఆస్ట్రేలియాను ఓడించడం ఇదే తొలిసారి. ఏడాది నిషేధం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సేవలు అందుబాటులో లేకపోయాయి.

గాయపడటంలో రోహిత్‌శర్మ, ఇషాంత్‌శర్మకు విశ్రాంతి కల్పించారు. జట్టులోకి హార్దిక్ పాండ్యాకు తిరిగి రాలేదు. రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్లుగా సేవలందించనున్నారు. టీ 20 జట్టు నుంచి తప్పుకున్న కుల్‌దీప్ యాదవ్‌ను టెస్ట్ జట్టులో స్థానం కల్పించారు. ఐపీఎల్‌లో భాగం కాని భారత టెస్ట్ నిపుణులు చేతేశ్వర్ పుజారా, హనుమా విహారి యూఏఈ చేరుకుని ఆరు రోజులు నిర్బంధంలో ఉన్నారు. రవిశాస్త్రి నేతృత్వంలోని కోచింగ్ సిబ్బంది కూడా యూఏఈలో ఉన్నారు.

బోర్డులు ఇంకా మ్యాచ్‌లను అధికారికంగా ప్రకటించకపోగా.. డిసెంబర్‌ 17న అడిలైడ్ ప్రారంభ టెస్టుకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు. ఇక్కడ డే అండ్‌ నైట్‌ టెస్ట్ జరుగనున్నది. బాక్సింగ్ డే టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. జనవరి 7 నుంచి 11 వరకు మూడవ టెస్టుకు సిడ్రీ మైదానం, చివరి టెస్ట్ జనవరి 15 నుంచి 19 వరకు బ్రిస్బేన్‌ మైదానంలో జరుగనున్నది.

జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, శుభాంష్‌ గిల్, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్), జస్‌ప్రిత్ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, మహమ్మద్‌ సిరాజ్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.