శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 28, 2020 , 20:20:48

MI vs RCB: పడిక్కల్‌ అర్ధసెంచరీ

MI vs RCB: పడిక్కల్‌ అర్ధసెంచరీ

అబుదాబి:  ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు  నిలకడగా ఆడుతోంది.  ఓపెనర్లు జోష్‌ ఫిలిప్‌, దేవదత్‌ పడిక్కల్‌ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. రాహుల్‌ చాహర్‌ వేసిన 8వ ఓవర్లో ఫిలిప్‌(33) పెవిలియన్‌ చేరాడు. 

మరో ఓపెనర్‌ పడిక్కల్‌ దూకుడుగా ఆడుతున్నాడు. 30 బంతుల్లో 10ఫోర్ల సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు.  11 ఓవర్లకు బెంగళూరు వికెట్‌ నష్టానికి 93 పరుగులు చేసింది.  దేవదత్‌(53)కు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(7) సహకారం అందిస్తున్నాడు.