గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 12, 2020 , 20:30:36

RCB vs KKR: ఫించ్ ... బాదుడు షురూ

RCB vs KKR: ఫించ్ ... బాదుడు షురూ

షార్జా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌, దేవదత్‌ పడిక్కల్‌ ఆరంభం నుంచి వేగంగా ఆడి మంచి స్కోరు సాధించారు. కోల్‌కతా బౌలర్లపై  ఎదురుదాడికి దిగి పవర్‌ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 47 పరుగులు  రాబట్టింది. ఆండ్రూ రస్సెల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో పడిక్కల్‌(32) బౌల్డ్‌ అయ్యాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నిదానంగా ఆడుతుండగా మరో ఎండ్‌లో అరోన్‌ ఫించ్‌ భారీ షాట్లతో చెలరేగుతున్నాడు.  11ఓవర్లకు బెంగళూరు వికెట్‌ నష్టానికి 86 పరుగులు సాధించింది. ఫించ్‌(41), కోహ్లీ(9) క్రీజులో ఉన్నారు.