ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 05, 2020 , 09:10:55

టీమ్‌ఇండియా ఓపెనర్లు ఔట్‌..

టీమ్‌ఇండియా ఓపెనర్లు ఔట్‌..

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌ ఆచితూచి ఆడుతున్నారు.

హామిల్టన్‌  న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ నిదానంగా ఆడుతోంది. ఓపెనర్లు  స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌ చేరడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌ ఆచితూచి ఆడుతున్నారు.  మంచి భాగస్వామ్యం నెలకొల్పాలనే  లక్ష్యంతో విరాట్‌తో కలిసి అయ్యర్‌ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఓపెనర్లుగా అరంగేట్రం చేసిన పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ ఫర్వాలేదనిపించారు. 

50 పరుగుల భాగస్వామ్యం అనంతరం గ్రాండ్‌హోం ఓవర్‌లో షా కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సౌథీ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో ఫోర్‌ కొట్టి  ఊపుమీదున్న అగర్వాల్‌ కూడా ఔటయ్యాడు. తక్కువ స్కోరుకే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్‌పై ఒత్తిడి నెలకొంది.  ప్రస్తుతం కోహ్లీ(28), అయ్యర్‌(24) భారీ షాట్లకు పోకుండా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ నిర్మిస్తున్నారు. కుదురుకున్న ఈ జోడీ 50 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేయడంతో జట్టు స్కోరు 100 దాటింది.  22 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 2 వికెట్లకు 115 పరుగులు చేసింది. 


logo