మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 23, 2020 , 17:15:05

మూడు ఫార్మాట్లలోనూ టాప్‌-10లో కోహ్లీ

మూడు ఫార్మాట్లలోనూ టాప్‌-10లో కోహ్లీ

దుబాయ్‌: ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ(697 పాయింట్లు) ఒక స్థానాన్ని మెరుగుపరచుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ కేఎల్‌రాహుల్‌(816 పాయింట్లు) మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు.  బ్యాట్స్‌మన్‌, బౌలర్లు, ఆల్‌రౌండర్ల కేటగిరీల్లో టాప్‌-10లో రాహుల్‌, కోహ్లీ మాత్రమే చోటు దక్కించుకున్నారు. 

915 రేటింగ్‌ పాయింట్లతో ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ డేవిడ్‌ మలన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా పాక్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ 820 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉన్నాడు.  పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ  మూడు ఫార్మాట్లలోనూ టాప్‌-10లో స్థానం సంపాదించాడు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలొ కొనసాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి:

బాక్సింగ్‌ డే టెస్టు నుంచి వార్నర్‌, అబాట్‌ ఔట్‌

ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్‌కూ షమీ డౌటే!

సన్‌రైజర్స్‌ను వీడనున్న కేన్‌ విలియమ్సన్‌?