శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Jul 28, 2020 , 12:33:04

దేశంలోని అగ్ర అథ్లెట్లలో కోహ్లి ఒకడు : పాక్‌ బౌలింగ్‌ కోచ్‌ యూనిస్‌

దేశంలోని అగ్ర అథ్లెట్లలో కోహ్లి  ఒకడు :  పాక్‌ బౌలింగ్‌ కోచ్‌ యూనిస్‌

దేశంలోని అగ్ర అథ్లెట్లలో కోహ్లి ఒకడని, ఫిట్‌నెస్‌ విషయంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే తమ జట్టు ఆటగాళ్లు వెనుకబడి లేరని పాకిస్తాన్ బౌలింగ్ లెజెండ్, ప్రస్తుత బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ అన్నారు.  కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరు పొందాడు. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలిస్తే ఆటపై అతను ఎంత అంకితబావం చూపుతాడో అర్థమవుతుంది. కోహ్లీ ఫిట్‌నెస్‌ మంత్రాన్ని మొత్తం భారత జట్టు, ఇతర జట్లు కూడా స్వీకరించాయి. భారతదేశ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ నుంచి మాజీ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ వరకు అందరూ ఫిట్‌నెస్‌పై భారత కెప్టెన్‌ను ప్రశంసించిన వారే.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వకార్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించాడు. ఫిట్‌నెస్‌ పట్ల అంకితభావంతో కోహ్లి తన ఆటతీరునే మార్చుకున్నాడన్నారు. "విరాట్ కోహ్లీ ఆటను అభివృద్ధి చేశాడు. వన్డే, టీ20 క్రికెట్‌తో సహా అన్ని ఫార్మాట్లలో అతను అద్భుతంగా రాణిస్తాడు. టెస్ట్ మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడతాడు. క్రికెట్‌కు అతను తీసుకొచ్చిన అతి పెద్ద వ్యత్యాసం అతని ఫిట్‌నెస్’’ అని ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో గ్లోఫాన్స్ఆఫీషియల్‌లో అభిమానులతో సంభాషించేటప్పుడు యూనిస్ చెప్పారు.


"విరాట్‌ ప్రపంచ వ్యాప్తంగా ఫిట్‌నెస్‌ బార్‌ను ఏర్పాటు చేశాడు. విరాట్ కోహ్లీ విషయంలో ప్రతి ఒక్కరికి అతనిలో అన్ని లక్షణాలు నచ్చుతాయి. అతను ఆరోగ్యంగా ఉంటాడు. ఎల్లప్పుడూ ఉత్తమమని నిరుపించుకోవడానికి తాపత్రేయ పడుతుంటాడు. అతను ఒక పోరాట యోధుడు. అందుకే మనమందరం అతడిని ఇష్ట పడతాం’’ అని వకార్‌ అన్నారు.

పాక్‌ ఆటగాళ్లు కోహ్లి ఫిట్‌నెస్‌కు సరితూగగలరా అని ఓ మీడియా విలేకరి అడిగిన ప్రశ్నకు  యూనిస్‌ ఇలా సమాధానమిచ్చాడు. ‘‘చాలా మంది క్రికెటర్లు ఫిట్ గా ఉన్నారనడంలో సందేహం లేదు. ఉత్తమ ఫిట్‌నెస్‌ ప్రమాణాలతో మూడు ఫార్మాట్లలోనూ రాణించగలుగుతారు. విరాట్‌ దేశంలోని అథ్లెట్లలో ఒకడు. మా కురాళ్లు కూడా ఫిట్‌నెస్‌ విషయంలో మెరుగ్గానే ఉన్నార’’రన్నారు.

‘‘బాబర్ ఆజమ్‌ను తీసుకోండి. అతను చాలా ఫిట్‌గా ఉన్నాడు. షాహీన్ షా అఫ్రిది సూపర్ ఫిట్. మేము మా సొంత బార్‌ను సెట్ చేస్తాం. మేము వేరొకరిని కాపీ చేయము. పాకిస్తాన్ క్రికెట్‌కు సరిపోయే బార్‌ను మేము సెట్ చేస్తాం, జట్టును ముందుకు తీసుకువెళ్తాం’’అని వకార్‌ అన్నారు. మాంచెస్టర్‌లో ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుతో పాకిస్తాన్ ఇంగ్లండ్‌పై 3 టెస్టులు, 3 టీ20లను ఆడనుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo