సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 17, 2020 , 15:58:04

విరాట్‌ కోహ్లీ నయా రికార్డు..ఆ ఒక్క మైదానంలోనే..!

 విరాట్‌ కోహ్లీ నయా రికార్డు..ఆ ఒక్క మైదానంలోనే..!

అడిలైడ్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న రన్‌మెషీన్‌ విరాట్‌ తన టెస్టు కెరీర్‌లో అడిలైడ్‌ ఓవల్‌  మైదానంలోనే అత్యధిక రన్స్‌ సాధించాడు. ఆస్ట్రేలియాతో  డే/నైట్‌ టెస్టులో విరాట్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు.   టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌  ఆశించిన స్థాయిలో రాణించకపోయినా కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

అచ్చొచ్చిన  మైదానంలో భారీ స్కోరు చేయాలనే పట్టుదలతో విరాట్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. సాధారణంగా ఏ ఆటగాడైనా అలవాటైన స్వదేశీ పిచ్‌లపై  ఎక్కువ పరుగులు చేస్తుంటారు. అందరికన్నా  భిన్నంగా విరాట్‌ విదేశీ గడ్డపై ఒకే మైదానంలో అత్యధిక వ్యక్తిగత పరుగులు రాబట్టడం విశేషం. 

ఒకే స్టేడియంలో కోహ్లీ అత్యధిక పరుగుల వివరాలివే..

482* - అడిలైడ్‌ ఓవల్‌(ఆస్ట్రేలియా)  

467 - అరుణ్‌ జైట్లీ స్టేడియం(ఢిల్లీ) 

433 - వాంఖడే స్టేడియం(ముంబై)  

379 -రాజీవ్‌ గాంధీ స్టేడియం(హైదరాబాద్‌)  

354 -విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం(నాగ్‌పూర్‌)   

ఓవల్‌ మైదానంలో విరాట్‌ పరుగుల జాబితా ఇదే..!

 116

22

115

141

3

34

50*


logo