శనివారం 23 జనవరి 2021
Sports - Dec 02, 2020 , 10:27:25

కింగ్ కోహ్లీ.. వ‌న్డేల్లో 12 వేల ప‌రుగులు

కింగ్ కోహ్లీ.. వ‌న్డేల్లో 12 వేల ప‌రుగులు

స‌చిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన కోహ్లీ..

హైద‌రాబాద్‌:  డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు.  వ‌న్డేల్లో అత్యంత వేగంగా 12 వేల ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్‌గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు.  కేవ‌లం 251 వ‌న్డేల్లో విరాట్ ఈ ఘ‌న‌త‌ను కైవ‌సం చేసుకున్నాడు.  242వ‌ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.  వ‌న్డేల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావ‌రేజ్ 59.41గా ఉంది. కోహ్లీ వ‌న్డే ఖాతాలో 43 సెంచ‌రీలు ఉన్నాయి.  ప‌రిమితి ఓవ‌ర్ల క్రికెట్‌లో త‌న‌కు సాటి లేద‌న్న రీతిలో కోహ్లీ త‌న బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు.  రికార్డు మీద రికార్డులు తిర‌గ‌రాస్తూ.. క్రికెట్ కెరీర్‌ను కొన‌సాగిస్తున్నాడు.  కోహ్లీ 242, స‌చిన్ 300, పాంటింగ్ 314, సంగ‌క్క‌ర 336, జ‌య‌సూర్య 379వ ఇన్నింగ్స్‌లో 12 వేల ప‌రుగుల మైలురాయిని దాటారు. కోహ్లీ దూకుడుకు స‌చిన్ రికార్డులు ఒక్కొక్క‌టి క‌నుమ‌రుగ‌వుతున్నాయి. స‌చిన్ 300 ఇన్నింగ్స్‌లో 12 వేల ప‌రుగుల్ని చేయ‌గా.. కోహ్లీ మాత్రం 242 ఇన్నింగ్స్‌లోనే ఆ ఘ‌న‌త‌ను సాధించాడు. వ‌న్డేల్లో అత్యంత వేగంగా 8వేలు, 9 వేలు, ప‌ది వేలు, 11 వేల ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్‌గా కూడా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు.  

క్యాన్‌బెరాలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడ‌వ వ‌న్డేల్లో విరాట్‌.. ఈ రికార్డును న‌మోదు చేశాడు.  తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న భార‌త్‌.. 16 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల‌కు 85 ర‌న్స్ చేసింది. కోహ్లీ 31, అయ్య‌ర్ 2  ర‌న్స్‌ ‌తో క్రీజ్‌లో ఉన్నారు. 


logo