శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 12, 2021 , 01:38:37

కోహ్లీకి కూతురు

కోహ్లీకి కూతురు

  • పండంటి పాపకు జన్మనిచ్చిన అనుష్కశర్మ 
  • సహచర, మాజీ క్రికెటర్ల అభినందనలు 
  • ట్విట్టర్‌లో విరాట్‌ సంతోషం

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తండ్రయ్యాడు. అతడి భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ సోమవారం పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ట్విట్టర్‌లో వెల్లడించాడు. ‘మాకు పాప జన్మించిందనే విషయాన్ని పంచుకునేందుకు ఎంతో సంతోషిస్తున్నా. మీ ప్రేమకు, ప్రార్థనలకు, అభినందనలకు కృతజ్ఞతలు చెబుతున్నాం’ అని కోహ్లీ పేర్కొన్నాడు. అనుష్క, పుట్టినపాప ఎంతో సంతోషంగా ఉన్నారని విరాట్‌ ట్విట్టర్‌లో వెల్లడించాడు.  తొలి టెస్టు ముగియగానే ఆస్ట్రేలియా పర్యటన నుంచి పితృత్వ సెలవులపై కోహ్లీ భారత్‌కు తిరిగివచ్చాడు. కాగా విరాట్‌, అనుష్క 2017లో పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 


logo