ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 23, 2020 , 00:34:10

స్వదేశానికి కోహ్లీ

స్వదేశానికి కోహ్లీ

అడిలైడ్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి బయలుదేరాడు. జనవరిలో తన భార్య అనుష్క శర్మ తొలి సంతానానికి జన్మనివ్వనుండడంతో పితృత్వ సెలవులపై విరాట్‌ భారత్‌కు వస్తున్నాడు. అడిలైడ్‌ డే అండ్‌ నైట్‌ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో విమానమెక్కే ముందు జట్టు సభ్యులతో కోహ్లీ మాట్లాడాడు. ఆత్మైస్థెర్యంతో సిరీస్‌లో మిగిలిన మూడు టెస్టులు ఆడాలని సూచించాడు. విరాట్‌ గైర్హాజరీలో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానే టీమ్‌ఇండియాకు సారథ్యం వహించనున్నాడు. రెండో టెస్టు ఈ నెల 26న మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది. 


logo