ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్ ఒలింపిక్స్ మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి వేలాది మంది అథ్లెట్లు పాల్గొనే అత్యున్నత క్రీడా వేదిక ఒలింపిక్స్. ఈసారి జపాన్ రాజధాని టోక్యో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తోంది. గతేడాదే జరగాల్సిన ఈ గేమ్స్ కరోనా కారణంగా ఈ ఏడాది జులై 23కు వాయిదా పడ్డాయి. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉండటంతో అభిమానులు లేకుండానే గేమ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి.