గురువారం 02 జూలై 2020
Sports - May 18, 2020 , 16:28:22

బంగ్లా టైగర్స్‌ డైరెక్టర్‌గా సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌

బంగ్లా టైగర్స్‌ డైరెక్టర్‌గా సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌

అబుదాబి:  అబుదాబి టీ10 క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫ్రాంఛైజీ బంగ్లా టైగర్స్‌ టీమ్‌ డైరెక్టర్‌గా సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ లాన్స్‌ క్లూసెనర్‌ నియమితులయ్యారు. ఈ ఏడాది టీ10 క్రికెట్‌ లీగ్‌ వచ్చే నవంబర్‌ 19 నుంచి 26 మధ్య అబుదాబిలోని షేక్‌ అబు జాయెద్‌ స్టేడియంలో జరగనుంది. 'టోర్నమెంట్‌లో అత్యంత బలమైన జట్టుగా  మార్చడానికి బంగ్లా టైగర్స్ ఎంతగానో కృషి చేస్తోంది. ఈ సీజన్‌కు  క్లూసెనర్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో చేర్చుకున్నట్లు'  బంగ్లా టైగర్స్‌ ఛైర్మన్‌ మహ్మద్‌ యాసిన్‌ చౌధురి తెలిపారు. 

అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ ప్రధాన కోచ్‌గా కూడా   మాజీ ఆల్‌రౌండర్‌ క్లూసెనర్‌ పనిచేస్తున్నాడు. క్లూసెనర్‌ తన క్రికెట్‌ కెరీర్‌లో 49 టెస్టులు, 171 వన్డేలు ఆడాడు. 2000 సంవత్సరంలో విజ్డెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచాడు. 


logo