బుధవారం 21 అక్టోబర్ 2020
Sports - Oct 01, 2020 , 17:00:30

KXIP vs MI : ముంబై మెరిసేనా..!

KXIP vs MI : ముంబై మెరిసేనా..!

అబుదాబి: ఐపీఎల్‌-13 సీజన్‌లో  భాగంగా   ముంబై ఇండియన్స్‌  గురువారం  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో  తలపడనుంది. ఇరు జట్లు కూడా గెలవాల్సిన  మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిని ఎదుర్కొన్నాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో  పోరులో ముంబై ఇండియన్స్‌ సూపర్‌ ఓవర్లో  ఓడింది.  224 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో పంజాబ్‌ పరాజం పాలైంది.  రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో  ఓడిపోయి పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయాయి. 

ప్రస్తుత సీజన్‌లో సంచలన విజయాలు సాధిస్తున్న  పంజాబ్‌ ఇతర  జట్లకు సవాల్‌ విసురుతోంది.  కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌  అగర్వాల్‌  పరుగుల వరద పారిస్తున్నారు.  రోహిత్‌ శర్మ నేతృత్వంలోని  ముంబై  బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో టాపార్డర్‌ విఫలం కాగా   ఇషాన్‌ కిషన్‌,  పొలార్డ్‌  వీరోచితంగా పోరాడినా ఫలితం దక్కలేదు.

పంజాబ్‌ బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. డెత్‌ ఓవర్లలో మహహ్మద్‌ షమీ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ముంబై బౌలర్‌ బుమ్రా నిలకడలేమి ఆ జట్టును బాగా ఇబ్బందిపెడుతున్నది. మూడు మ్యాచ్‌ల్లో బుమ్రా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టడం ఆందోళన  కలిగిస్తోంది.    ప్రస్తుత ఫామ్‌ చూస్తే   ముంబై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌ అని చెప్పొచ్చు. 


logo