ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 26, 2020 , 00:01:54

రాహుల్‌ బ్యాట్‌కు రూ.2.64లక్షలు

రాహుల్‌ బ్యాట్‌కు రూ.2.64లక్షలు

న్యూఢిల్లీ: గతేడాది వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ వినియోగించిన బ్యాట్‌ వేలంలో రూ.2.64లక్షలు పలికింది. నిరాదరణకు గురైన పిల్లల సంక్షేమం కోసం తన బ్యాట్‌తో పాటు గతంలో వినియోగించిన కొంత క్రికెట్‌ సామగ్రిని  రాహుల్‌.. భారత్‌ ఆర్మీ సంస్థకు ఇచ్చాడు. వేలంలో రాహుల్‌ హెల్మెట్‌ రూ.1,22,677, ప్యాడ్లు రూ.33,028, వన్డే జెర్సీ రూ.1,13,240, టీ20 జెర్సీ రూ.1,04,824, టెస్టు  జెర్సీ రూ.1,32,774, గ్లవ్స్‌ రూ.28,728 ధర పలికాయి. ఈ మొత్తాన్ని అవారే ఫౌండేషన్‌ ద్వారా నిరాదరణకు గురైన పిల్లల కోసం వినియోగించనున్నారు. కాగా,గతేడాది వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఎదురురైన బాధాకర ఓటమి భారత క్రికెటర్లను ఇంకా వెంటాడుతూనే ఉందని కేఎల్‌ రాహుల్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మ్యాచ్‌ కలలోకి వచ్చి హఠాత్తుగా నిద్ర లేచిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపాడు. logo