గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 15:04:40

కేఎల్ రాహుల్ 56 ఔట్‌

కేఎల్ రాహుల్ 56 ఔట్‌

హైద‌రాబాద్ : న‌్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న‌ ఆక్లాండ్ టీ20లో కేఎల్ రాహుల్ దుమ్మురేపాడు.  భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు రాహుల్ మంచి స్టార్ట్ ఇచ్చాడు.  కేవ‌లం 23 బంతుల్లోనే రాహుల్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో మూడు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. 56 ర‌న్స్ చేసిన రాహుల్‌.. సౌధీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి క్యాచ్ అవుట‌య్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 203 ర‌న్స్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం భార‌త్ 10 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల‌కు 115 ర‌న్స్ చేసింది.

 


logo