లండన్: ఇండియన్ టీమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ( KL Rahul ) లార్డ్స్ టెస్ట్‌లో సెంచరీ చేసిన తర్వాత అతనికి డ్రెస్సింగ్ రూమ్‌లో ఘన స్వాగతం లభించింది. క్రికెట్ మక్కాగా భావించే ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో సెంచరీ చేసిన గ్రేట్ ప్లేయర్స్ లిస్ట్‌లో రాహుల్ పేరు కూడా చేరింది. అక్కడి బాల్కనీలోని సెంచరీ హీరోల లిస్ట్‌లో అతని పేరును యాడ్ చేశారు. ఇక తొలి రోజు హీరోగా నిలిచిన రాహుల్‌కు ఆట ముగిసిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు. కోచ్ రవిశాస్త్రి సహా మిగతా టీమ్ సభ్యులు కంగ్రాట్స్ చెప్పారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.