గురువారం 02 జూలై 2020
Sports - May 10, 2020 , 22:13:00

నా ఆల్​టైం ఫేవరెట్ బ్యాట్స్​మన్ అతడే: రాహుల్

నా ఆల్​టైం ఫేవరెట్ బ్యాట్స్​మన్ అతడే: రాహుల్

న్యూఢిల్లీ: తనకు అత్యంత ఇష్టమైన బ్యాట్స్​మన్ పేరును టీమ్​ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ఆదివారం ట్విట్టర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతడు సమాధానాలు ఇచ్చాడు. ‘మీ ఆల్​టైం ఫేవరెట్ బ్యాట్స్​మెన్ ఎవరు’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఏబీ డివిలియర్స్ అని రాహుల్ తెలిపాడు. అలాగే ఐపీఎల్​లో ప్రస్తుతం ఆడుతున్న కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్ కాకుండా మరో ఇష్టమైన జట్టు ఏదంటే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అని చెప్పాడు. 2013-14 రంజీ ట్రోఫీ గెలువడం కర్ణాటక తరఫున తనకు అత్యంత అద్భుతమైన క్షణాలు అని రాహుల్ తెలిపాడు. గతంలో రాయల్​ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్​, కేఎల్ రాహుల్ కలిసి ఆడారు. ప్రస్తుతం ఏబీ.. బెంగళూరు జట్టుతోనే ఉండగా.. రాహుల్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. 


logo