గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 10, 2020 , 18:25:31

KXIP vs KK: ఆరంభంలో రాహుల్‌‌, మయాంక్‌ మెరుపులు

KXIP vs KK: ఆరంభంలో రాహుల్‌‌,  మయాంక్‌  మెరుపులు

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ వేగంగా బ్యాటింగ్‌ చేస్తోంది.   వరుస  పరాజయాలు వెంటాడుతున్న వేళ  పంజాబ్‌ ఓపెనర్లు  కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌  అగర్వాల్‌ ఆరంభం నుంచే కసిగా చెలరేగారు.   ప్రసిద్‌ కృష్ణ వేసిన రెండో  ఓవర్‌లో  రాహుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను   ఆండ్రీ రస్సెల్‌  వదిలేశాడు. క్యాచ్‌ అందుకునే సమయంలో రస్సెల్‌ గాయపడటంతో మైదానాన్ని వీడాడు. 

 ప్రసిద్‌ వేసిన నాలుగో ఓవర్లో అగర్వాల్‌ రెండు ఫోర్లు, సిక్సర్‌ బాది 14 రన్స్‌ రాబట్టాడు. రాహుల్‌ సైతం వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లతో రెచ్చిపోతున్నాడు. కుదురుకున్న జోడీని విడదీసేందుకు కోల్‌కతా బౌలర్లు శ్రమిస్తున్నారు.  9 ఓవర్లకు పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. రాహుల్‌(36), అగర్వాల్‌(31) క్రీజులో ఉన్నారు.