బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 10, 2020 , 18:43:11

KXIP vs KKR: రాహుల్‌‌, మయాంక్‌ అర్ధ శతకాలు

KXIP vs KKR:  రాహుల్‌‌, మయాంక్‌ అర్ధ శతకాలు

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌  గెలుపు దిశగా సాగుతోంది.  165 పరుగుల లక్ష్య ఛేదనలో  పంజాబ్‌ దూకుడుగా ఆడుతోంది.    సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌  స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. లక్ష్య ఛేదనలో మొదటి నుంచే ఓపెనర్లు టాప్‌గేర్‌లో ఉన్నారు. భారీ షాట్లతో స్కోరు బోర్డు వేగం పెంచారు.  

ఓపెనింగ్‌ జోడీ  పోటాపోటీగా బ్యాటింగ్‌  చేస్తూ అర్ధశతకాలు కూడా సాధించారు. అగర్వాల్‌ 33  బంతుల్లో  హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకోగా..రాహుల్‌ 42 బంతుల్లో 50 మార్క్‌ చేరుకున్నారు.  13  ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా106  పరుగులు చేసింది. రాహుల్‌(54), అగర్వాల్‌(51) క్రీజులో ఉన్నారు.  పంజాబ్‌ విజయానికి ఇంకా 42 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది.