ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 04, 2020 , 04:25:40

లోకేశ్‌ రాహుల్‌ @ 2

 లోకేశ్‌ రాహుల్‌ @ 2

దుబాయ్‌: కివీస్‌ గడ్డపై చరిత్రాత్మక సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమ్‌ఇండియా ఓపెనర్‌ రాహుల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 224 పరుగులు చేసిన రాహుల్‌ (823 పాయింట్లు).. కెరీర్‌లోనే అత్యుత్తమ ప్లేస్‌ సాధించాడు. న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు (265 పాయింట్లు) టీమ్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరింది. బ్యాట్స్‌మెన్‌ విభాగంలో విరాట్‌ కోహ్లీ తొమ్మిదో స్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్‌ శర్మ (10వ ర్యాంక్‌) మూడు స్థానాలు మెరుగుపరుచుకొని టాప్‌ టెన్‌లో అడుగుపెట్టాడు. పాకిస్థాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ (879 పాయింట్లు) అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. బౌలింగ్‌ విభాగంలో బుమ్రా 26 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌  విలియమ్సన్‌ 16వ ప్లేస్‌లో నిలిచాడు.

logo