శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 11, 2020 , 11:06:34

NZvIND:అయ్యర్‌ ఔట్‌.. రాహుల్‌ హాఫ్‌సెంచరీ

NZvIND:అయ్యర్‌ ఔట్‌.. రాహుల్‌ హాఫ్‌సెంచరీ

మౌంట్‌ మాంగనీ:  న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ అర్ధశతకంతో రాణించాడు. వన్డే సిరీస్‌లో రాహుల్‌కిది రెండో అర్ధశతకం కాగా.. ఓవరాల్‌గా వన్డేల్లో ఎనిమిదో హాఫ్‌సెంచరీ. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయ్యర్‌, రాహుల్‌ భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించారు. వీరిద్దరూ సంయమనంతో ఆడి నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రీజులో కుదురుకొని ప్రమాదకరంగా కన్పిస్తున్న  అయ్యర్‌ ను జిమ్మీ నీషమ్‌ పెవిలియన్‌ పంపాడు. 31వ ఓవర్లో గ్రాండ్‌హోంకు క్యాచ్‌ ఇచ్చి అయ్యర్‌ వెనుదిరిగాడు. 35 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. రాహుల్‌(62), మనీశ్‌ పాండే(11) క్రీజులో ఉన్నారు. logo