గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Oct 01, 2020 , 22:29:41

KXIP vs MI:రాహుల్‌ ఔట్‌..కష్టాల్లో పంజాబ్‌

KXIP vs MI:రాహుల్‌ ఔట్‌..కష్టాల్లో పంజాబ్‌

అబుదాబి:ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ స్వల్ప స్కోరుకే  మూడు వికెట్లు చేజార్చుకున్నది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(17) ఔటవడంతో జట్టు కష్టాల్లో పడింది. రాహుల్‌ చాహర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ మొదటి బంతికే రాహుల్‌ బౌల్డ్‌ అయ్యాడు. కీలక బ్యాట్స్‌మన్‌  పెవిలియన్‌ చేరడంతో   మ్యాచ్‌పై ముంబై మరింత పట్టుబిగించింది.   

ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన మయాంక్‌ అగర్వాల్‌(25) కూడా తక్కువ స్కోరుకే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. బుమ్రా బౌలింగ్‌లో అతడు కూడా బౌల్డ్‌ అయ్యాడు.  ఆ తర్వాత వచ్చిన కరుణ్‌ నాయర్‌ కూడా పాండ్య బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. నాయర్‌ వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. 10 ఓవర్లకు పంజాబ్‌ 3 వికెట్ల నష్టానికి  72 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌(21), మాక్స్‌వెల్‌(4) క్రీజులో ఉన్నారు. 


logo