మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Sep 24, 2020 , 20:07:03

IPL 2020:సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన రాహుల్‌

IPL 2020:సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన రాహుల్‌

దుబాయ్‌: ఐపీఎల్‌-2020లో భాగంగా  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో   జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిలకడగా ఆడుతోంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేస్తున్న పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌   బెంగళూరు బౌలర్లను  సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ వికెట్‌ను కాపాడుకుంటూ  ఆచితూచి ఆడుతున్నారు.   ఓపెనింగ్‌ జోడీ  సింగిల్స్‌ తీస్తూ స్కోర్‌ను ముందుకు నడిపిస్తున్నారు.  ఆరు ఓవర్లకు పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా  50 పరుగులు చేసింది. 

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్‌ అరుదైన రికార్డు సాధించాడు.  బెంగళూరుతో మ్యాచ్‌లో రెండు పరుగులు చేయడం ద్వారా 2వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. అత్యంత వేగంగా రెండు వేల పరుగులు చేసిన రికార్డు   టీమిండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్నది. తాజాగా ఆ రికార్డును  రాహుల్‌  అధిగమించాడు.  ఈ ఫీట్ సాధించడానికి టెండూల్కర్ 63 ఇన్నింగ్స్ తీసుకోగా..  రాహుల్ 60 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.  


logo