ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 09, 2020 , 15:52:38

ఐసీసీ ర్యాంకింగ్స్‌: రాహుల్‌ 3.. కోహ్లీ 8

ఐసీసీ ర్యాంకింగ్స్‌: రాహుల్‌ 3.. కోహ్లీ 8

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా  ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌   మూడో స్థానంలో నిలువగా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.  ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి ఇద్దరికే చోటు దక్కింది. కాన్‌బెర్రా వేదికగా జరిగిన మొదటి టీ20లో రాహుల్‌ అర్ధశతకంతో రాణించిన విషయం తెలిసిందే.

సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిన రాహుల్‌ ఒక స్థానాన్ని మెరుగుపరచుకొని మూడో స్థానానికి ఎగబాకాడు. ఆఖరి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విరాట్‌(85) ఒక ర్యాంకు మెరుగుపరచుకొని ఎనిమిది స్థానంలో నిలిచాడు.  డేవిడ్‌ మలన్‌(ఇంగ్లాండ్‌) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా   బాబర్‌ అజామ్‌(పాకిస్థాన్‌) రెండో ర్యాంకులో ఉన్నాడు.  మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో  కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బౌలర్ల జాబితాలో భారత్‌ నుంచి ఒక్క బౌలర్‌ కూడా టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు. 


logo