ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Sep 24, 2020 , 20:38:01

KXIP vs RCB: రాహుల్‌ అర్ధశతకం

KXIP vs RCB: రాహుల్‌ అర్ధశతకం

దుబాయ్: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అర్ధశతకం సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న రాహుల్‌ 36 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌ సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అతనికి 17వ అర్ధశతకం. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.  రన్‌రేట్‌ 8కి తగ్గకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.  12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ వికెట్‌ నష్టానికి 100 పరుగులు చేసింది. రాహుల్‌(52), పూరన్‌(16) క్రీజులో ఉన్నారు.